జూనియర్ డాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ.... జూనియర్ డాక్టర్లు ఆందోళన  చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి  చేసుకోవడం బాధకరమన్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాగానికి మంచిది కాదని సూచించారు. జూనియర్ డాక్టరల్ు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని... వారి డిమాండ్ పై స్పందించకపోగా... దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు.

జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లుపై జూనియర్ డాక్టరల్ు, వైద్యులు ఆందోళన చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని పవన్ పేర్కొన్నారు. విజయవాడ, తిరుపతిలలో చోటుచేసుకున్న ఈ ఘటనలపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని... జూనియర్ డాక్టర్లలో ధైర్యాన్ని నింపాలని డిమాండ్ చేశారు.