అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్. ప్రభుత్వం చేస్తున్న తప్పులను విమర్శిస్తుంటే తనను తిట్టడం మంచి పద్ధతి కాదన్నారు పవన్ కళ్యాణ్. 

ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతుంటే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. 

గతంలో అంబటి రాంబాబు తనను వివాహానికి ఆహ్వానిస్తే వచ్చానని గుర్తు చేశారు. అంబటి రాంబాబు మీ ఇంటికి పెళ్లికి వచ్చాం గుర్తు పెట్టుకోండి పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలంటూ పవన్ హెచ్చరించారు.  

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటామని అనుకుంటున్నారేమోనని భ్రమలో ఉన్నారేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముందే రావొచ్చునని హెచ్చరించారు. ఎలాపడితే అలా మాట్లాడటం సరికాదన్నారు.  

ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలపై తాము తాము పోరాటం చేస్తుంటే తమకు సమాధానం ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. వైసీపీకి ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం కట్టబెట్టారని గుర్తు చేశారు. మంచి పరిపాలన అందిస్తారన్న ఉద్దేశంతో ఏపీ ప్రజలు151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు.  

తాము అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి గానీ తిరిగి తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదన్నారు. విమర్శలను కూడా తట్టుకోలేకపోతే ఎలా అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. 

ఇకపోతే ప్రకాశం జిల్లా జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి ఏం సాధిస్తారని నిలదీశారు.

రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి గానీ, నిధుల గురించి గానీ కేంద్రాన్ని నిలదీయలేరన్నారు. కేంద్రానికి ఎదురుతిరిగితే కేసులు తెరపైకి వస్తాయని ఈ నేపథ్యంలో రాజీపడటం తప్పనిసరి పరిస్థితి అని చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డీఎన్‌ఏ ఒకేలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి ఉదయం చంద్రబాబు ఏం విమర్శలు చేస్తున్నారో సాయంత్రానికి పవన్‌ కూడా అవే విమర్శలు చేస్తున్నారంటూ అంబటి మండిపడిన సంగతి తెలిసిందే.  
 

ఈ వార్తలు కూడా చదవండి

మీకు కోపం ఉంటే వేరేలా తీర్చుకోండి, వ్యంగ్యంగా మాట్లాడొద్దు: మంత్రి బొత్సకు పవన్ హెచ్చరిక

ప్రధానికి ఫిర్యాదు చేస్తా: జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ 

జగన్ తో నాకు గొడవలు లేవు... పవన్ షాకింగ్ కామెంట్స్..

సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు