Asianet News TeluguAsianet News Telugu

రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలి: దిశా ఘటనపై పవన్ స్పందన

దిశా ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఓ నలుగురు కామాంధులు ఓ యువతిని నడిరోడ్డుపైనే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసే స్థాయికి మన సమాజం చేరిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

janasena chief pawan kalyan reacts disha incident
Author
Tirupati, First Published Dec 2, 2019, 3:22 PM IST

దిశా ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఓ నలుగురు కామాంధులు ఓ యువతిని నడిరోడ్డుపైనే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసే స్థాయికి మన సమాజం చేరిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అక్కాచెల్లెళ్ల మధ్య పుట్టి పెరిగానని.. ఆడబిడ్డ ఇంటి నుంచి బయటకెళ్లొచ్చిన తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి పడే బాధ తనకు తెలుసునన్నారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు కొందరు జూనియర్ ఆర్టిస్టులు వేధింపులు ఎదుర్కొవడం తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.

Also read:జగన్ కులం, మతంపై పవన్ వ్యాఖ్యలు: వైఎస్ జగన్ కౌంటర్

అలాంటి పరిస్ధితుల్లో వాళ్లు ఇళ్లకు వెళ్లేసరికి కర్ర పట్టుకుని నిల్చొనేవాడినని, లేదంటే తన కారు ఇచ్చి పంపించేవాడినని పవన్ గుర్తు చేశారు. మన ఇంటి, సమాజంలోని ఆడబిడ్డల మాన, ప్రాణాలను రక్షించలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటని జనసేనాని ప్రశ్నించారు.

నాయకులు ఇలా ఉండబట్టే కొందరు ఆడపిల్లలపై రెచ్చిపోతున్నారని పవన్ ఆరోపించారు. నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్‌లో ఉంటే జనం వెళ్లి వారిని ఉరి తీయాలని, చంపేయాలని డిమాండ్ చేస్తున్నారని పవన్ గుర్తుచేశారు.

ఆడపిల్లపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నలుగురు చూస్తుండగా బెత్తంతో తోలు ఊడిపోయేలా కొట్టాలని పవన్ డిమాండ్ చేశారు. దేవతలు సైతం అభయ హస్తంతో పాటు ఆయుధాలతో ఉండేది సమాజాన్ని ఇలా నడపాలనే అని జనసేనాని తెలిపారు. 

కర్నూలులో సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి ఉదంతాన్ని పవన్ గుర్తుచేశారు. ఈ ఘటనలో ఆ పాప అత్యాచారానికి గురై మరణించడం వల్లే చనిపోయిందని ఆధారాలు చెబుతుంటే.. రెండు రోజుల క్రితం అలాంటిదేమి జరగలేదని ప్రకటన వచ్చిందని జనసేనాని వెల్లడించారు.

తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అన్ని పనులకు జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ చేశారని.. మరి ప్రీతి ఉదంతంపై జగన్ ఎందుకు ఎదురెళ్లలేదని పవన్ ప్రశ్నించారు. వరంగల్‌లో యాసిడ్ దాడికి గురైన స్వప్నికను తాను పరామర్శించానని... కానీ ప్రీతి కుటుంబాన్ని ఓదార్చేందుకు రాయలసీమలో నాయకులు లేరా అని ఆయన మండిపడ్డారు.

రాయలసీమలో మనుషులను బతకనివ్వరని.. చెట్లను సైతం నరికేస్తారని, కేవలం జగన్ రెడ్డి చెట్టు అయితేనే అవి బతుకుతాయని జనసేనాని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి దానికి వైసీపీ రంగుల్ని వేశారని.. కేవలం ఏడుకొండల వాడికి మాత్రమేనంటూ ఆయన సెటైర్లు వేశారు. తాను ఎవరిని వెనకేసుకురానని, ఎవరికీ అండగా ఉండనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

శబరిమలలో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని.. దానిని ఒక ఆచారంగానే చూడాలి కానీ, వివాదం చేయొద్దంటూ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో దళితులతో పాటు మిగిలిన వారిపై దాడులు జరుగుతున్నాయని.. దానిని ప్రశ్నించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:వీడియో కాన్ఫరెన్స్‌లొద్దు.. పల్లె నిద్ర చేయండి: కలెక్టర్లకు జగన్ మార్గదర్శకాలు

తిరుపతిలో అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాను సంపూర్ణ మద్ధతు తెలుపుతానని.. మతాల పట్ల చీలిక తెచ్చింది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. మతం మారినా కులాలు మారడం లేదని.. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని జగన్‌పై మండిపడ్డారు. తన పేరు వెనుక నాయుడు లేదని దానిని వైసీపీ నేతలే పెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీది రంగుల రాజ్యమని పవన్ మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios