Asianet News TeluguAsianet News Telugu

శివానంద మహరాజ్ తో పవన్ కల్యాణ్ భేటీ...

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురువారం ఉత్తకరాఖండ్ లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన అక్కడ శివానంద స్వామీజీతో భేటీ అయ్యారు.

janasena chief pawan kalyan meeting with shivanand maharaj at uttarakhand
Author
Haridwar, First Published Oct 10, 2019, 8:43 PM IST

నసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు ఇవాళ(గురువారం) ఉత్తరాఖండ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. హరిద్వార్ లోని మాత్రి సదన్ ఆశ్రమాన్ని సందర్శించిన జనసేనాని స్వామి శివానంద మహారాజ్ తో భేటీ అయ్యారు. 

ముందుగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ కు చేరుకున్న పవన్ అక్కడి నుండి హరిద్వార్ వెళ్లారు. అక్కడ మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్ తో భేటీ అయ్యారు.

హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమం గంగా ప్రక్షాళన పోరాటానికి ఒక వేదికగా నిలిచింది. స్వామి నిగమానంద ఈ ఆశ్రమంలోనే గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు అన్నపానీయాలు మాని నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. 33ఏళ్ల వయసులోనే స్వామి నిగమానంద ప్రాణాలు విడిచారు. ప్రొఫెసర్ జి‌.డి.అగర్వాల్ సైతం గంగా ప్రక్షాళన కోసం పొరాడి ప్రాణాలు విడిచారు.

ఆశ్రమంలో ఉన్న స్వామి నిగమానంద సమాధిని పవన్ కల్యాణ్ ముందుగా సందర్శించారు. ఆయన సమాధివద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత  స్వామి శివానంద మహారాజ్ తో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు అంశాలపై చర్చించారు.

పవిత్ర గంగా నది తీవ్రంగా కలుషితం అవుతోందని స్వామి శివానంద మహారాజ్ పవన్ వ్దద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్షాళన కోసం చేస్తున్న పోరాటానికి దక్షిణాది నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. తమ పోరాటానికి అండగా నిలవాలని పవన్ కల్యాణ్ ను ఆయన కోరారు. దీనిపై పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “గంగా నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమే” అని అందువల్లే ఈ ఉద్యమానికి తన పూర్తి మద్దతు వుంటుందన్నారు. 

చివర్లో స్వామి శివానంద మహారాజ్ తో కలిసి పవన్ గంగానదికి హారతినిచ్చారు.  ఈ భేటీలో రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, ‘వాటర్ మ్యాన్’రాజేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios