ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం వుంది. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వున్నారు. 

అంతకుముందు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందన్నారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవాల్సి వుందని, 40 వరకు సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని జోగయ్య వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారని, కనీసం రెండున్నరేళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా వుండాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు. 

జనసేన టీడీపీలో కూటమిలో త్వరలో బీజేపీ కూడా చేరే అవకాశం వుందని పవన్ తనకు తెలిపినట్లు మాజీ మంత్రి వెల్లడించారు. జోగయ్య లేఖ రాసిన కొద్దిగంటల్లోనే పవన్ , చంద్రబాబుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ, జనసేన కూటమి సైతం ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. సీట్ల కేటాయింపు, ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ నెలాఖరు నాటికి క్లారిటీ వచ్చే అవకాశం వుంది.