జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విజయవాడకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విజయవాడకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును విజయవాడలో నమోదు చేయించుకొన్నారు. గత ఎన్నికల్లో ఆయన విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకొన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పవన్ కళ్యాణ్ రేపు విజయవాడకు వస్తారు.

విజయవాడలోని పటమటలంకలోని జిల్లా పరిషత్ స్కూల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకొంటారు.మున్పిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సాధించింది.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో తాము సాధిస్తామని వైసీపీ ధీమాతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేశారని విపక్షాలు ఆరోపించాయి.ఈ విషయమై విపక్షాలు హైకోర్టులో పిటిషన్లు కూడ దాఖలు చేసిన విషయం తెలిసిందే.