అమరావతి: 2024 కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వస్తాయనుకొంటున్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఆయన  కార్యకర్తలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలనేది తన అభిప్రాయంగా చెప్పారు. నాయకత్వ లోపం కారణంగా  అభిమానులు పార్టీ వైపు రావడం లేదన్నారు.

also read:అమరావతిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీకి అత్యధిక సీట్లిచ్చి గౌరవించారని ఆయన చెప్పారు. కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకొనే పరిస్థితుల్లో వైసీపీ లేదదని ఆయన విమర్శించారు.2014లో ఏపీ ప్రయోజనాల కోసం వేరే పార్టీలకు మద్దతిచ్చినట్టుగా ఆయన చెప్పారు. టీడీపీ క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతోందన్నారు.

సినిమా షూటింగ్ లకు విరామం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించారు. నిన్న పార్టీ నేతలతో సమావేశమైన జనసేనాని.. ఇవాళ కూడ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అదే విధంగా అమరావతి జేఏసీ నేతలు, అమరావతి మహిళా నేతలతో కూడ ఆయన సమావేశమయ్యారు.