Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజధానిని అమరావతి నుండి తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తమ కార్యాచరణను అప్పుడు ప్రకటిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
 

Janasena chief pawan kalyan interesting comments on amaravathi capital city lns
Author
Amaravathi, First Published Nov 18, 2020, 1:18 PM IST

రాజధానిని అమరావతి నుండి తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తమ కార్యాచరణను అప్పుడు ప్రకటిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.గురువారం నాడు అమరావతి జేఏసీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. 

రాజధానిని అమరావతి నుండి తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అమరావతి రైతుల సమస్యలపై బీజేపీతో కూడా చర్చిస్తామని ఆయన జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు.

మూడు రాజధానులు అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ విషయమై ఎక్కడా కూడ పేపర్ మీద పెట్టడం లేదని చెప్పారు.అమరావతి రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత తమ కార్యాచరణను తప్పకుండా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

 

also read:అస్తవ్యస్తం చేసి.. ఇప్పుడు భూములు తిరిగిస్తారా: వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు

ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలని కూడ ఆయన జేఏసీ నేతలను కోరారు.  బీజేపీ, జనసేనల నుండి జేఏసీ నేతలు ఏం కోరుతున్నారో చెప్పాలని ఆయన కోరారు.ఈ విషయమై రాతపూర్వకంగా జేఏసీ ఏ రకమైన డిమాండ్లను కోరుకొంటుందో రాతపూర్వకంగా ఇస్తే ఈ విషయమై తాను బీజేపీతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అమరావతి జేఏసీ నేతలు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరుతున్నారని.... ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios