మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తర్వాతి పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ రెడీ అయ్యింది. ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.

రాజధాని తరలిపోవడం ఖాయమని తేలడంతో భూములిచ్చిన అమరావతి రైతుల కోసం ఏం చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. రాజధాని ఎక్కడికీ పోదు.. పోయినా మళ్లీ వస్తుందని గతంలో అనేక సార్లు పవన్ అన్నారు.

అయితే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో జగన్ ముందుకు వెళ్లారు. అమరావతే రాజధాని నాడు గట్టిగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ మధ్య స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Also Read:అమరావతికి అప్పుడే జగన్ చెల్లుచీటి: ఇక విశాఖకు తరలడమే తరువాయి

రాజధాని విషయంలో బీజేపీ హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని మొదట్లో పవన్ భావించారు. అయితే తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పడంతో ఏం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే రాష్ట్ర శాఖ మాత్రం తాము అమరావతికే కట్టుబడి వున్నామని అంటోంది. బీజేపీతో అవగాహనలో ఉన్న పవన్ ప్రస్తుతం తమ పార్టీ వైఖరిని నిర్వహించిన తర్వాత.. బీజేపీతో కూడా చర్చించే అవకాశం వుంది.

రాజధాని కోసం భూములిచ్చిన దాదాపు 20 వేల మంది రైతుల భవిష్యత్తు కోసం పోరాడాలని భావిస్తున్నారు పవన్. దానిక సంబంధించిన కార్యాచరణ కోసమే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అవుతున్నారు పవన్ కల్యాణ్.