అమరావతి:పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో... దానికి పదింతలు బీభత్సం మున్సిపల్ ఎన్నికల్లో సృష్టిస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యర్ధులను నామినేషన్లు దాఖలు చేయనివ్వడం లేదు,. భయపెట్టారు, దాడులకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్ధులు నిలబడితే బెదిరింపులు.. కిడ్నాప్ లు.. ఎదురు తిరిగితే దాడులు... రక్తపాతం. వైసీపీని ఇలానే వదిలేస్తే వీళ్ళు ఇంకా పేట్రేగిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.ఎదిరించే వ్యక్తులు లేకపోతే వీళ్ల దాష్టీకానికి అంతు లేకుండాపోతుందన్నారు.. రాష్ట్రంలో వైసీపీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిపోరాడుతున్నామని ఆయన తెలిపారు.

ఈ నెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. . “నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 27 శాతం ఓట్లను కైవసం చేసుకున్నట్టు చెప్పారు.  వందల సంఖ్యలో సర్పంచులు, అంతకుమించి ఉప సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామన్నారు.

 పోటీ చేసిన 85 శాతం పంచాయతీల్లో దాదాపు 65 శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానానికి రావడం మార్పుకు సంకేతమన్నారు.  ఈ మార్పును చూసి ఓర్వలేకే, భయపడి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.. జనసేన నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసునని ఆయన చెప్పారు.

 వీళ్ల ధాటికి కాకలు తీరిన రాజకీయ పార్టీలు సైతం నిలబడలేకపోయాయన్నారు. జనసేన అభ్యర్ధులను బెదిరించినా ఎదురొడ్డి ఎన్నికల బరిలో నిలబడ్డారు.  వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి, యుద్ధం చేయగల రక్తం జనసైనికులదని ఆయన తెలిపారు. 

ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. వైసీపీ బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లం కాదన్నారు. మీ దాష్టీకాలు ఆపకపోతే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసిన వాళ్లమన్నారు.మా జనసైనికులను కానీ, ఆడపడుచులను కానీ, మా నాయకులను గానీ బెదిరిస్తే చూస్తూ ఊరుకోం. కుటిల రాజకీయాలు చేసిన వాళ్లు మట్టిలో కలిసిపోవడం ఈ ప్రపంచం కళ్లారా చూసిందని ఆయన ప్రస్తావించారు.

ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఓటు అనే బోటుతో తీరం దాటిన వైసీపీ నాయకులు... మళ్లీ ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తున్నారని చెప్పారు.  దయచేసి ఓటును వైసీపీ నాయకులకు వేయకండి. వాళ్లు ఇచ్చే నోట్లకు ఆశపడి ఓట్లు వేస్తే మనల్ని యాచించే స్థాయికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్ధులు నిలబడితే బెదిరింపులు.. కిడ్నాప్ లు.. ఎదురు తిరిగితే దాడులు... రక్తపాతం. వైసీపీని ఇలానే వదిలేస్తే వీళ్ళు ఇంకా పేట్రేగిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.ఎదిరించే వ్యక్తులు లేకపోతే వీళ్ల దాష్టీకానికి అంతు లేకుండాపోతుందన్నారు.. రాష్ట్రంలో వైసీపీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిపోరాడుతున్నామని ఆయన తెలిపారు.రాష్ట్రంలోని పలు చోట్ల జనసేన పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి ఆయన ఆ వీడియోలో ప్రస్తావించారు. 

హిట్లర్ లాంటి ఎందరో ఉన్మాదులు మట్టికరుచుకుపోయారు మీరెంత? మీ బతుకులెంత? గ్రామాల్లో దాష్టికాన్ని ఆపకపోతే మటుకు ప్రజలే మిమ్మల్ని తన్ని తరిమేసే రోజులు వస్తాయన్నారు.