Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు ‘అమ్మ ఒడి’ఇప్పుడు ‘అమ్మకానికో బడి’.. ఏపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్..!

పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరిస్తున్నారంటూ' విమర్శలు చేశారు. ఏపీలో తాము చదువుకునే పాఠశాలలు తీసేయొద్దు అని విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

Janasena Chief Pawan Kalyan Fire on CM YS Jagan
Author
Hyderabad, First Published Nov 15, 2021, 11:02 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పవన్ మండిపడ్డారు.

నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటాం., కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరిస్తున్నారంటూ' విమర్శలు చేశారు. ఏపీలో తాము చదువుకునే పాఠశాలలు తీసేయొద్దు అని విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

 

అప్పుడు ‘అమ్మ ఒడి' ఇప్పుడు ‘అమ్మకానికో బడి' అంటూ జగన్ సర్కార్​పై సెటైర్ వేశారు పవన్​. ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై ఏపీ సర్కారు నవంబరు 12న నాలుగు ఆప్షన్లతో సర్క్యులర్ మెమో ఇచ్చిందని పవన్ ట్విట్టర్లో.. ఆ జీవోకి సంబంధించిన పత్రాలను పోస్ట్ చేశారు.

Also Read: మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ : ‘నోట్ల రద్దుతో డబ్బులు ఇరుక్కుపోయాయి...’ మెసేజ్ తో యువతికి రూ. 32 లక్షల టోకరా..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్నారు. 6,700 మంది టీచర్ల ఉపాధి కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు.


విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా.. ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునేందుకు జగన్​ సర్కార్ ఇంత హడావుడి ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేన్నారు.

ఒకవేళ ఎయిడెడ్ పాఠశాలకు సాయం అందించాలనుకుంటే.. స్వాధీనం మాత్రమే మార్గమా అని ప్రశ్నించారు పవన్. ప్రత్యామ్నాయాల మార్గాలు లేవా? అని దీనిపై ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios