Asianet News TeluguAsianet News Telugu

విశాఖ దుర్ఘటన... జగన్ ప్రభుత్వంపై పవన్ విమర్శలు

ధైన్యంగా మిగిలిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరిన్ మృత్యువాయువుతో కూడా సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని మండిపడ్డారు.

janasena chief Pawan Kalyan Fire on CM YS Jagan Over Vizag Gas Leakage incident
Author
Hyderabad, First Published May 18, 2020, 8:15 AM IST

ఇటీవల విశాఖ లో గ్యాస్ లీకేజ్ దుర్ఘటన కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ విమర్శల వర్షం కురిపించారు.

కరోనా వైరస్ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... విశాఖ దుర్ఘటనపై ప్రస్తావించడం గమనార్హం. విశాఖ వాసులు స్టైరీన్ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. మరి పరిష్కారం ఎప్పుడు చూపిస్తారంటూ పవన్ నిలదీశారు.

ధైన్యంగా మిగిలిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరిన్ మృత్యువాయువుతో కూడా సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని మండిపడ్డారు. పారిశ్రామిక వృద్ధి ముఖ్యమని.. అదే సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం అంతకన్నా ఎక్కువ ఉందని పవన్ పేర్కొన్నారు.

పారిశ్రామికాభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులు చూసి నిపుణులు కూడా నివ్వెరపోతున్నారని దుయ్యబట్టారు. ఆ కేసు దర్యాప్తులో ఇంత వరకు ఎటువంటి పురోగతి కనిపించడం లేదన్నారు.
 ప
స్టైరీన్ గ్యాస్ పీల్చిన వారు భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావని.. గ్యాస్ బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఈ సందర్భంగా పవన్ ప్రభుత్వాన్ని కోరారు. పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios