జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తుండగా సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్రలో పవన్‌ కాన్వాయ్‌లో ఓ యువకుడిని ఢీ కొట్టింది. దీంతో బాలక తేజ అనే యువకుడు గాయాలపాలయ్యాడు.  

శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తుండగా సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్రలో పవన్‌ కాన్వాయ్‌లో ఓ యువకుడిని ఢీ కొట్టింది. దీంతో బాలక తేజ అనే యువకుడు గాయాలపాలయ్యాడు. 

తేజ కాలుపైనుంచి కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు కాన్వాయ్‌ని అడ్డగించారు. తేజను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆందోళన చేశారు. దీంతో ప్రమాదానికి కారణమైన కారులోనే తేజను బోరుభద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకెళ్లాలని తల్లిదండ్రలు, బంధువులు డిమాండ్ చేశారు. 


దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాన్వాయ్‌ నిలిచిపోవడంతో బందోబస్తులో ఉన్న సీఐ నవీన్‌కుమార్‌, జనసేన నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. తేజను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకువెళ్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వెంటనే ఆ క్షతగాత్రుడు బాలక తేజను జనసేన నేతలు శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.