అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేస్తామన్న సీఎం జగన్ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక ఒక్కదాన్నే కూల్చివేస్తే దానిపై అనుమానించాల్సి వస్తోందని అలా కాకుండా అక్రమ కట్టడాలను రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేస్తే దానిపై ఎలాంటి అనుమానాలు ఉండవన్నారు. 

పర్యావరణ నిబంధనల ప్రకారం కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చివేత అనేది మంచి నిర్ణయమేనన్నారు. అది జగన్ సర్కార్ చిత్తశుద్దితో చేస్తే మంచిదేనని కానీ ఒక్క ప్రజావేదిక విషయంలో మాత్రం చేస్తే మంచిది కాదన్నారు. అంతా ప్రశ్నిస్తారన్నారు. 

కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేస్తే తాను కూడా సంతోషపడతానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏం నిర్మించిన వాటిని అడ్డుకోవాల్సిందేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

ఈ వార్తలు కూడా చదవండి

ఖచ్చితంగా పదవులు కావాలనుకునే వారే పార్టీ మారతారు: పవన్ కళ్యాణ్

హోదా విషయంలో టీడీపీ యూటర్న్, మద్దతు కోసమే బీఎస్పీతో పొత్తు : పవన్ కళ్యాణ్

తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, మంచి చేస్తే ప్రశంసిస్తాం: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు