జనసేన పార్టీపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీల వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి శత్రువులు ఎవరో కాదని జనసేనేనని చెప్పుకొచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీల వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి శత్రువులు ఎవరో కాదని జనసేనేనని చెప్పుకొచ్చారు.
పార్టీలో తాను ఒకరికి నచ్చకపోవచ్చునని లేదా పార్టీలోని కొందరు వ్యక్తులు కొందరికి నచ్చకపోవచ్చునని ఫలితంగా పార్టీలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొందన్నారు. దాన్ని అంతా సర్దుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.
మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా అంతా సర్దుకుపోవాలని హితబోద చేశారు. సర్దుకుపోతేనే భవిష్యత్ ఉంటుందన్నారు. సర్దుకుపోదాం, మాట తూలకుండా ముందుకు సాగాలని సూచించారు. జనసేన పార్టీకి పునాది మనమే వేసుకుంటున్నామని మనమే దాన్ని బలంగా నిర్మించుకోవాలన్నారు.
సమాజం కోసం జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేవాడినని అయితే తన మనస్తత్వం ప్రజలకు తెలియాలనే ముందు దానిపై ఫోకస్ పెట్టానన్నారు.
తాను ఎలా ఉంటాను అనేది జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలని ఆ తర్వాత తన పోరాటలను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు ముందుకు వెళ్లాలన్నదే తన లక్ష్యమన్నారు. అందుకు తాను ఆదర్శవంతంగా ఉండాలని ఆ లక్ష్యంతోనే తాను పార్టీని చాలా క్రమశిక్షణతో నడుపుతున్నానని చెప్పుకొచ్చారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2019, 12:01 PM IST