కోరి తెచ్చుకున్న వ్యక్తి బదిలీయా.. ఏదో జరిగింది: ఎల్వీ ట్రాన్స్‌ఫర్‌పై పవన్ వ్యాఖ్యలు
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. ఏరి కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఆకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా అర్థమవుతోందని పవన్ ఆరోపించారు.
వైసీపీ నేతలపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను, ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయాలని.. ఇసుకపై ఇతర రాష్ట్రాల్లో లేని ఇబ్బంది ఏపీలో ఎందుకని పవన్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల సమస్యలపై ఒక్క సీటున్న జనసేన పోరాటం చేస్తోందని.. రెండు వారాల్లోపు సమస్య పరిష్కారానికి కృషి చేయకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ హెచ్చరించారు.
వ్యక్తిగత నిందనలు మాని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని వైసీపీ నేతలకు జనసేనానిని చురకలంటించారు. మరోవైపు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపైనా పవన్ కల్యాణ్ స్పందించారు.
Also Read:షోకాజ్ నోటీసుల ఎఫెక్ట్: ఎల్వీ బదిలీ, కొత్త సీఎస్ రేసులో వీరే..
ఏరి కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఆకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా అర్థమవుతోందని పవన్ ఆరోపించారు.
మంత్రి అవంతికి కాలేజీలు, సీఎం జగన్‌కి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వంటి వ్యాపారాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలు చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. చేస్తానో లేదో తనకే తెలియదని, కానీ నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తానని జనసేనాని స్పష్టం చేశారు.
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఏపీ సీసీఎల్ఏ సెక్రటరీ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ఇంచార్జీ సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కాలంలో బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సీఎం ఆదేశాల మేరకే ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే తనకు తెలియకుండానే బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ రూల్స్ తో పాటు కండక్ట్ రూల్స్‌ను అతిక్రమించాడని ఆరోపిస్తూ ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులను జారీ చేశాడు.
Also Read:మాపై కేసులు...బిజెపి పై దాడులు...జనసేనపై విమర్శలు...: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
ఈ వ్యవహరం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు , సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు సోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సీఎం సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎస్ బదిలీ చేసినట్టుగా సమాచారం. బాపట్ల హెచ్ఆర్‌డీ డైరెక్టరర్ జనరల్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంచార్జీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమించారు. మరో వైపు ఏపీ సీఎస్ గా నీలం సహాని, సమీర్ శర్మల పేర్లను ప్రభుత్వం ఏపీ సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.