ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) చిత్తూరు జిల్లాలో ఓ జనసేన పార్టీ (Janasena party) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు అతడిని అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) చిత్తూరు జిల్లాలో ఓ జనసేన పార్టీ (Janasena party) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు అతడిని అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గాంధీపురానికి చెందిన సుహానా భాషాను తిరుపతిలోని పేరూరు చెరువుపై వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో నరికి అతి కిరాతకంగా హత్య చేవారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పోలీసులు అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుహాన్ భాషాను హత్య చేసి పారిపోయిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
