Asianet News TeluguAsianet News Telugu

ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలకు సెలవులివ్వాలి:జనసేన నేత నాదెండ్ల మనోహర్

ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలకు సెలువులివ్వాలని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని కోరారు.కరోనా నుండి విద్యార్ధులను కాపాడేందుకు సెలవులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Jana Sena leader Nadendla Manohar Demands To give holidays till January ending
Author
Guntur, First Published Jan 17, 2022, 10:28 PM IST


అమరావతి: corona కేసులను దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని జనసేన  రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మెన్ Nadendla manohar  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు సోమవారం నాడు ఆయన మీడియాకు ఓక ప్రకటన విడుదల చేశారు. educational Institutionsలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తేనే కరోనా నుండి విద్యార్ధులను కాపాడుకొంటామని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరిగితే విద్యా సంస్థలను మూసివేస్తామని విద్యాశాఖ మంత్రి Adumulap Suresh ప్రకటన బాధ్యత రాహిత్యాన్ని తెలుపుతుందన్నారు.

విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ద బాధ్యత లేదనేది అర్ధమౌతుందని ఆయన విమర్శించారు. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థను మూసివేసి online విధానంలో తరగతుల నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలువులు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.. మెడికల్ కాలేజీల్లోని వైద్య విద్యార్ధులే కరోనా బారిన పడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మరో వైపు స్కూల్స్ తెరవడానికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్కూళ్లలో కరోనా కేసులు వస్తే శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాలతో పోలికలు అనవసరమని చెప్పారు. గత 150 రోజులుగా నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయన్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరి అత్యవసరమైతే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని.. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని తెలిపారు. పిల్లలు ఇంట్లో ఉన్న, బయట ఉన్న వారిలో లక్షణాలు గుర్తించలేమని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆన్‌లైన్ క్లాస్‌లు ఒక లెవల్ వరకే పరిమితం అవుతాయని అన్నారు. ఆన్‌లైన్ క్లాసులు ఉన్నత విద్యకు కొంతవరకు ఉపయోగపడొచ్చు.. కానీ ప్రాథమిక విద్యకు, మాధ్యమిక విద్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆన్‌లైన్ క్లాసులను ఒక మార్గంగా ఎంచుకుని స్కూల్స్‌ను మూసివేయడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. 

విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని.. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని తెలిపారు. పిల్లలు ఇంట్లో ఉన్న, బయట ఉన్న వారిలో లక్షణాలు గుర్తించలేమని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆన్‌లైన్ క్లాస్‌లు ఒక లెవల్ వరకే పరిమితం అవుతాయని అన్నారు. ఆన్‌లైన్ క్లాసులు ఉన్నత విద్యకు కొంతవరకు ఉపయోగపడొచ్చు.. కానీ ప్రాథమిక విద్యకు, మాధ్యమిక విద్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆన్‌లైన్ క్లాసులను ఒక మార్గంగా ఎంచుకుని స్కూల్స్‌ను మూసివేయడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.  నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగియడంతో ఇవాళ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios