Asianet News TeluguAsianet News Telugu

వరద నష్టంపై సమగ్ర సమాచారం లేదు: జగన్ సర్కార్ పై నాదెండ్ల ఫైర్


భారీ వర్షంతో  పంట నష్టంతో పాటు ఆస్తి నష్టంపై ప్రభుత్వం వద్ద సమగ్ర సమచారం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

Jana sena leader Nadendal manohar serious comments on ycp government
Author
Tirupati, First Published Nov 25, 2021, 4:37 PM IST


తిరుపతి:  రాష్ట్రంలో వరద నష్టంపై ప్రభుత్వం అంచనాలు సరిగా లేవని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్  విమర్శించారు. గురువారం నాడు తిరుపతిలో  Nadendla Manohar మీడియాతో మాట్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో Ys jagan ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు కూడా సరిగా లేదని  మనోహర్ ఆరోపించారు.kadapa జిల్లాలోని మండపల్లె గ్రామంలోనే  15 పశువులు వరదలో మృత్యువాత పడ్డాయని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో Heavy rains కారణంగా జరిగిన నష్టంపై కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. crop నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో  చోటు చేసుకొన్న వరద నష్టానికి సుమారు రూ. 1000 కోట్లు అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.  ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా ఆయన లేఖలు రాశారు. భారీ వర్షాల కారణంగా ఏపీ రాష్ట్రంలోన కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ మూడు జిల్లాలో  పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకొంది. చెయ్చేరు నది ప్రవాహంలో సుమారు 30 మంది గల్లంతయ్యారు. నందలూరు వద్ద మూడు ఆర్టీసీ బస్సులు నీటిలో మునిగాయి.

also read Heavy rains in AP: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి

వరద నష్టం అంచనా విషయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాల సమయంలో  ఏపీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. 

రెండు మూడు రోజుల్లో ఏపీ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వర్షాలు వదలడంలేదు, వరదలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల భారీగా పంట నష్టం జరగగా,  ఇప్పటికే పలు గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. దీంతో చాలా మంది పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు.వరద భాధిత కుటుంబాలకు  ప్రతీ ఒక్క ఇంటికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె,  కేజీ ఉల్లిపాయ,  కేజీ ఆలుగడ్డ,  రెండు వేల రూపాయలు ఇవ్వాలని,  ఇల్లు కూలిపోయినా,  పాక్షికంగా దెబ్బతిన్నా...వారికి వెంటనే నగదు, పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బులు, ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5200 నగదు, చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios