వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్ పై ఉన్నట్లు తమ నేత పవన్ కల్యాణ్ పై అవినీతి ఆరోపణలు లేవని జనసేన నాయకుడు మండలి రాజేశ్ అన్నారు.
వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తే తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పవన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ సహించలేకపోతున్నారని, ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని ఆయన అన్నారు.
పవన్ నలుగురు పెళ్లాలను మార్చారని, కార్లను మార్చినట్లు ఐదేళ్లకోసారి భార్యలను మారుస్తారని, మరొకరినైతే నిత్య పెళ్లికొడుకుగా జైల్లో పెట్టేవాళ్లని జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Last Updated 25, Jul 2018, 2:26 PM IST