Andhra Pradesh Exit Polls 2024 : జన్ కీ బాత్ సర్వేలో టిడిపి-వైసిపి హోరాహోరీ ... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?  

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కూటమి మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. జన్ కీ బాత్ సర్వేలో కూడా ఇదే తేలింది. 

Jan Ki baat exit poll survey results on Andhra Pradesh Lok Sabha seats akp

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమి అధికార వైసిపికి టఫ్ ఫైట్ ఇచ్చిందని జన్ కి బాత్ సర్వేలో తేల్చింది. ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమికి 10-14 సీట్లు వస్తాయని... అధికార వైసిపికి 8-13 సీట్లు వస్తాయని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఏపీలో బిజెపికి 2-3 సీట్లు వస్తాయని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగితే నాలుగో విడతలో ఏపీ ఎన్నికలు జరిగాయి. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం-జనసేన-బిజెపి  కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది.  

ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డుస్థాయిలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెలతో పాటు పట్టణ ఓటర్లు కూడా పోలింగ్ బూత్ కు కదలి రావడంతో అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇలా ఓటేయడానికి ప్రజలు పోటెత్తడం ఎవరికి లాభిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.

అయితే ఏపీలో పోలింగ్ ముగిసిన నాటినుండి ఫలితాలపై చర్చ మొదలైంది. తమ పార్టీదే గెలుపంటే తమదే గెలుపని అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఎవరి పక్షాన నిలిచారో అంతుచిక్కడం లేదు. దీంతో ఇవాళ తుది దశ లోక్ సభ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.  వీటిని తెలుగు ప్రజలే కాదు అభ్యర్థులు, పార్టీ పెద్దలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios