ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగ్గంపేట ఒకటి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేట రాజకీయాలు హీటెక్కాయి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల నాగ వీరవెంకట విష్ణు సత్యమార్తాండ రావు (చంటిబాబు) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు కాకుండా మరొకరికి వైసిపి టికెట్ దక్కింది. ఇలా జగ్గంపేటలో గెలుపుకోసం రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.
జగ్గంపేట రాజకీయాలు :
జగ్గంపేటలో ఎప్పుడూ ఆసక్తికర రాజకీయాలు సాగుతుంటాయి. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, టిడిపి ఎంపిగా పనిచేసిన తోట నరసింహం ప్రస్తుతం వైసిపి అభ్యర్థిగా వున్నాడు. అలాగే వైసిపి ఎమ్మెల్యేగా పనిచేసిన జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) ప్రస్తుతం టిడిపి అభ్యర్థిగా మారారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న జ్యోతుల చంటిబాబు సీటుదక్కక సైలెన్స్ గా వుండాల్సి వస్తోంది.
జగ్గంపేటలో టిడిపి, వైసిపి రెండూ బలంగానే వున్నాయి. స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు తరచూ పార్టీలు మారుతున్నారు. 2014 లో వైసిపి తరపున నెహ్రూ, టిడిపి నుండి చంటిబాబు బరిలోకి దిగారు. అదే 2019 లో ఈ సీన్ రివర్స్ అయ్యింది... వైసిపి నుండి చంటిబాబు, టిడిపి నుండి నెహ్రూ పోటీచేసారు.
1983, 85,89 లో వరుసగా తోట సుబ్బారావు, 1994,99 లో జ్యోతుల నెహ్రూ టిడిపి తరపున పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2014, 19 లో వరుసగా వైసిపి గెలిచింది. ఇలా ఇరుపార్టీలు జగ్గంపేటలో సత్తా చాటుతుండటంతో ఈసారి గెలుపెవరిదో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.
జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. గోకవరం
2. జగ్గంపేట
3.గండేపల్లి
4. కిర్లంపూడి
జగ్గంపేట అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,11,481
పురుషులు - 1,05,118
మహిళలు - 1,06,353
జగ్గంపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
జగ్గంపేటలో వైసిపి ఈసారి ప్రయోగం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును పక్కనపెట్టి మాజీ మంత్రి తోట నరసింహంను బరిలోకి దింపుతోంది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మరోసారి జ్యోతుల నెహ్రూపై నమ్మకం వుంచింది. ఆయననే జగ్గంపేట అభ్యర్థిగా ప్రకటించింది టిడిపి.
జగ్గంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
జగ్గంపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,81,127 (85 శాతం)
వైసిపి - జ్యోతుల చంటిబాబు - 93,496 (51 శాతం) - 23,365 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - జ్యోతుల నెహ్రూ - 70,131 (38 శాతం) - ఓటమి
జగ్గంపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,66,213 (83 శాతం)
టిడిపి - జ్యోతుల నెహ్రూ - 86,146 (55 శాతం) -15,932 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - జ్యోతుల చంటిబాబు - 72,214 (43 శాతం) - ఓటమి
