Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని, వంశీలపై వ్యాఖ్యలు.. నాలుక కోస్తా: మల్లాది వాసుకి సామినేని ఉదయభాను వార్నింగ్

టీడీపీ (tdp) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సానుభూతి కోసం చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చారని ఆరోపించారు జగ్గయ్యపేట వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను (samineni udaya bhanu) . మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయభాను. వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చీరేస్తామంటూ హెచ్చరించారు. వాసుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉదయభాను తెలిపారు.

jaggaiahpet ysrcp mla samineni udaya bhanu warns malladi vasu
Author
Vijayawada, First Published Dec 2, 2021, 6:49 PM IST

టీడీపీ (tdp) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సానుభూతి కోసం చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చారని ఆరోపించారు జగ్గయ్యపేట వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను (samineni udaya bhanu) . గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయ నాయకుడంటే ధైర్యంగా వుండాలంటూ చురకలు వేశారు. ఇంతవరకు ఎవరూ ఇలా ఏడవలేదన్నారు. మరోవైపు మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయభాను.

వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చీరేస్తామంటూ హెచ్చరించారు. వాసుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉదయభాను తెలిపారు. చంద్రబాబు కుటుంబసభ్యుల పేర్లను సభలో ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. కులపరమైన కార్యక్రమాల్లో వారి కష్టనష్టాలు చెప్పుకోవాలని కానీ.. రాజకీయ వ్యాఖ్యలు చేయటం సరికాదని ఉదయభాను హితవు పలికారు. కొడాలి నాని, వంశీ, అంబటిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఉదయభాను వార్నింగ్ ఇచ్చారు. 

కాగా.. కమ్మ కులంలో చీడపురుగుల్లా తయారైన ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు కుటుంబం మీద ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతోన్న అన్యాయం చూసి ఆవేదనతోనే వ్యాఖ్యలు చేశానని వాసు తెలిపారు. తనకు ఏ రకమైన నేర చరిత్ర లేదని.. హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని వాసు చెప్పుకొచ్చారు. 

Also Read:కొడాలి నాని, వంశీలను లేపేయ్యాలంటూ వ్యాఖ్యలు.. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే ఇలా: క్షమాపణలు చెప్పిన మల్లాది వాసు

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసి బాధతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే తన వీడియోని వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఎవరి మీదా కక్షలు లేవని.. స్కెచ్ వేయటం.. అందుకోసం డబ్బులు ఖర్చు చేయటం లాంటి ఉద్దేశాలు లేవని వెల్లడించారు. కమ్మ కమ్యూనిటీ, వెల్ఫేర్, సంక్షేమం కోసమే మాత్రమే ఖర్చు పెడతానని వాసు వివరించారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అంతేకాదు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వాసు స్పష్టం చేశారు. కుటుంబంలోని మహిళల మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios