అమరావతి:  ఏపీఎస్పీ ఏడిజి మాదిరెడ్డి ప్రతాప్ పై బదిలీ వేటు పడింది.  వెంటనే జీఏడీకి రిపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియా ఎదుట మాట్లాడటంపై వివరణ ఇవ్వాల్సిందిగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

ఇటీవల ఏపీఎస్పీ బెటాలియన్ డిజీగా మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆర్టీసీ హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై  ప్రభుత్వం సీరియస్ అయి అతడిపై వేటు వేసినట్లుంది. 

ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ చేయడంపై ప్రెస్ మీట్ నిర్వహించడం... బదిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారంలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఆయనను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆలిండియా సర్వీస్ నియమాలను ఉల్లంఘించారని అభిప్రాయ పడ్డారు.

7 రోజుల్లోగా తన వ్యాఖ్యలపై  వివరణ ఇవ్వాలంటూ చూపాలని నోటీసు జారీ చేశారు. రిప్లై ఇవ్వని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవు అని ప్రతాప్ కు జారీచేసిన  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.