ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి: ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో నలుగురు సలహాదారులు మరో ఏడాదిపాటు ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించనున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఏపీ ప్రభుత్వానికి ప్రజా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నెల 18వ తేదీతో ముగియాల్సి వుంది. అయితే జగన్ సర్కార్ ఆయన పదవీకాలాన్ని పొడిగించడంతో మరో ఏడాది సేవలు అందించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం పదవీకాలం జూన్ 7తో ముగియనుండి మరో ఏడాది పొడిగించారు. 

read more యువ సీఎం నాయకత్వంలో అద్భుతాలు...: విజయసాయి రెడ్డి

ఇక కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌, కో–ఆర్డినేటర్‌–కార్యక్రమాల సలహాదారు తలశిల రఘురాం పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియాల్సి వుంది. వీరి పదవీకాలం కూడా మరో ఏడాది పొడిగించింది జగన్ సర్కార్.