మొత్తానికి వైసీపీ అధినేత బూట్లలోకి మారారు. సోమవారం ఉదయం ప్రజాసంకల్పయాత్రను జగన్ ఇడుపులపాయలో ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

మొత్తానికి వైసీపీ అధినేత బూట్లలోకి మారారు. సోమవారం ఉదయం ప్రజాసంకల్పయాత్రను జగన్ ఇడుపులపాయలో ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించిన తర్వాత జగన్ నేరుగా బహిరంగసభ వేదిక వద్దకు పాదయాత్రను ప్రారంభించారు. యాత్రలో వైసీపీ అధినేత చెప్పులు వేసుకునే యాత్రను మొదలుపెట్టారు. అయితే, పాదయాత్ర చేయాలనుకునే వారు చెప్పులతో కాకుండా బూట్లు వేసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

జగన్ మాత్రం చెప్పులు వేసుకునే ఎందుకు నడిచారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మధ్యాహ్నం భోజన విరామం వరకూ చెప్పులు వేసుకునే నడిచిన జగన్ మధ్యాహ్నం తర్వాత నుండి బూట్లలోకి మారారు. బూట్లు వేసుకుని నడవటంలో ఉన్న సౌకర్యం చెప్పులు వేసుకుని నడవటంలో లేదన్న విషయంపై ‘ఏషియానెట్’ ఉదయమే ఓ కథనం ప్రకటించింది. చెప్పులు వేసుకునే నడిచేట్లయితే ఎక్కువ దూరం జగన్ నడవలేరన్న విషయాన్ని కూడా ఏషియా నెట్ ప్రస్తావించింది. సరే, మొత్తానికి ఏదైనా గానీ మధ్యాహ్నం నుండి జగన్ బూట్లలోకి మారారు.

జగన్ తొలి అడుగు...చెప్పులతోనే

https://goo.gl/VV5LtM