ప్రత్యేకహోదా సాధనలో జగన్ ప్రజల మద్దతు కావాలంటున్నారు. నవంబర్ 2వ తేదీ నుండి మొదలు పెట్టనున్న పాదయాత్రలో జనాల మద్దతును కూడగట్టనున్నట్లు జగన్ ప్రకటించారు.
ప్రత్యేకహోదా సాధనలో జగన్ ప్రజల మద్దతు కావాలంటున్నారు. నవంబర్ 2వ తేదీ నుండి మొదలు పెట్టనున్న పాదయాత్రలో జనాల మద్దతును కూడగట్టనున్నట్లు జగన్ ప్రకటించారు. అనంతపురంలో ప్రత్యేకహోదా డిమాండ్ తో మంగళవారం యువభేరి జరిగింది. అందులో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కోసం ఒక్క జగన్ మాత్రమే పోరాడితే సాధ్యం కాదన్నారు. ‘జనాల మద్దతు లేకపోతే జగన్ కూడా ఏమీ సాధించలేడు’ అంటూ జగన్ స్పష్టం చేసారు. నవంబర్ 2వ తేదీన ప్రారంభమవ్వనున్న పాదయాత్ర ఇడుపులపాయ నుండి చిత్తూరు మీదుగా ఇచ్చాపురం వరకూ 3 వేల కిలోమీటర్లు సాగుతుందని చెప్పారు.
తాను మహాపాదయాత్ర చేస్తుంటే ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలు కావాలని ఆశపడుతున్న నేతలందరూ వాళ్ళ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తారని వివరించారు. హోదా సాధనలో చివరి అస్త్రంగా తమ ఎంపిలందరితో రాజీనామా చేయించనున్నట్లు కూడా తెలిపారు. సరే, ఈ విషయాన్ని గతంలో కూడా ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గిన విషయం అందరూ చూసిందే.
మొత్తం మీద యువభేరి సక్సెస్ అయ్యిందనే అనుకోవచ్చు. విద్యార్ధులు, యువతతో నిర్వహించిన భేరి కాబట్టి పాల్గొన్నవారిలో కూడా ఉత్సాహం బాగానే కనబడింది. మధ్య మధ్యలో ప్రత్యేకహోదా, నిరుద్యోగ భృతి తదితరాల గురించి పోయిన ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హామీల క్లిప్పింగులను కూడా ప్రదర్శించారు. సరే, యాధావిధిగా తన ప్రసంగం తర్వాత జగన్ విద్యార్ధులు, యువతతో మాట్లాడించారు. వారు కూడా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని విమర్శిస్తూ అనేక ప్రశ్నలు సంధించటం గమనార్హం.
