వైసీపీ మంత్రులతో పాటు మిగిలిన ఎంఎల్ఏలను కూడా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు వచ్చేట్లు చేయగలిగితే జగన్ తన వ్యూహంలో సక్సెస్ అయినట్లే. చూడాలి ఏం జరుగుతుందో?
ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్ళటం ద్వారా చంద్రబాబునాయుడును ఎండగట్టేందుకు జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. గురువారం నుండి మూడు రోజుల పాటు వైసీపీ అధ్యక్షుడు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అపాయింట్మెంట్ ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడిని కూడా కలుద్దామని ప్లాన్ చేసారు. అదే విధంగా ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ను, పలువురు కేంద్రమంత్రులను, ప్రతిపక్షాల్లోని జాతీయ స్ధాయి నేతలను కూడా కలిసేందుకు పెద్ద స్కెచ్చే వేసారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాల మద్దతు తీసుకున్నట్లుగానే ఫిరాయింపుల అంశంలో కూడా జాతీయ మద్దతు కూడగట్టేందుకు జగన్ గట్టిగానే కృషి చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబును ఎంతవీలుంటే అంతా బద్నాం చేయాలన్నదే జగన్ వ్యూహం. అందుకనే, ఎంపిలు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలతో పాటు పలువురు నేతలను కూడా ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్న సంగతిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళటంలో ఇప్పటికే జగన్ సక్సెస్ అయ్యారు.
అయితే, తాజాగా ఫిరాయింపులకు మంత్రిపదవులను కూడా ఇవ్వటంతో చంద్రబాబు పరువును ఢిల్లీలో ఎండగట్టేందుకు జగన్ అవకాశంగా తీసుకుంటున్నారు. పనిలో పనిగా జాతీయ మీడియాలో కూడా ఫిరాయింపులపై కథనాటు వచ్చేట్లు చూస్తున్నారు. వివిధ మార్గాల్లో సిఎంపై ఒత్తిడిని పెంచటం ద్వారా వెంటనే ఫిరాయింపుల చేత రాజీనామాలు చేయించాలన్నది జగన్ ఆలోచన. ఇందులో భాగంగానే ఇప్పటికే చంద్రబాబు, ఫిరాయింపు మంత్రులపై ఒత్తిడి పెరుగుతున్నట్లే కనబడుతోంది. ఫిరాయింపు మంత్రులు రాజీనామాలు చేసారని ప్రభుత్వం లీకులు ఇవ్వటం, రాజీనామాలు అందాయని స్పీకర్ చెప్పటమే ఇందుకు ఉదాహరణ. అయితే, వైసీపీ మంత్రులతో పాటు మిగిలిన ఎంఎల్ఏలను కూడా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు వచ్చేట్లు చేయగలిగితే జగన్ తన వ్యూహంలో సక్సెస్ అయినట్లే. చూడాలి ఏం జరుగుతుందో?
