Asianet News TeluguAsianet News Telugu

అమెరికా ప్రసంగంలో చంద్రబాబు ఆ విషయాలను ప్రస్తావించాలి : మరో 6నెలల్లోనే ఎన్నికలు : జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రైతులకోసమే అమెరికా పర్యటన చేపడుతున్నట్లు ప్రచారం చేయించుకుంటున్నాడని వైఎస్ జగన్ ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితుల గురించి ప్రస్తావించాలని డిమాండ్ చేశాడు. ఓ వైపు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే సీఎం అమెరికా పర్యటనకు వెళ్ళడాన్ని జగన్ తప్పుబట్టారు. ఇలాంటి మనిషి అమెరికాలో ఆర్గానిక్ వ్యవసాయంపై ఏం ప్రసంగిస్తాడంటూ ఎద్దేవా చేశాడు. మైకు పట్టుకుని స్పీచ్ ఇచ్చేపుడు చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలని అన్నారు. నాబార్డు సర్వేలో రైతుల ఆదాయంలో దేశంలోనే ఏపి 28 వ స్థానంలో, రైతులకు మిగులు లాభంలో 29 వ స్థానంలో,  రైతుల అప్పుల్లొ 2 వ స్థానంలో ఉన్న విషయాన్ని ప్రపంచం దృష్టికి  చంద్రబాబు తీసుకెళ్లగలడా అని జగన్ ప్రశ్నించాడు.

jagan road show speech at kothavalasa
Author
Kothavalasa, First Published Sep 24, 2018, 6:10 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రైతులకోసమే అమెరికా పర్యటన చేపడుతున్నట్లు ప్రచారం చేయించుకుంటున్నాడని వైఎస్ జగన్ ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితుల గురించి ప్రస్తావించాలని డిమాండ్ చేశాడు. ఓ వైపు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే సీఎం అమెరికా పర్యటనకు వెళ్ళడాన్ని జగన్ తప్పుబట్టారు. ఇలాంటి మనిషి అమెరికాలో ఆర్గానిక్ వ్యవసాయంపై ఏం ప్రసంగిస్తాడంటూ ఎద్దేవా చేశాడు. మైకు పట్టుకుని స్పీచ్ ఇచ్చేపుడు చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలని అన్నారు. నాబార్డు సర్వేలో రైతుల ఆదాయంలో దేశంలోనే ఏపి 28 వ స్థానంలో, రైతులకు మిగులు లాభంలో 29 వ స్థానంలో,  రైతుల అప్పుల్లొ 2 వ స్థానంలో ఉన్న విషయాన్ని ప్రపంచం దృష్టికి  చంద్రబాబు తీసుకెళ్లగలడా అని జగన్ ప్రశ్నించాడు.

జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇవాళ 3వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ నేపథ్యంలో  ఎస్ కోట నియోజకవర్గం దేశపాత్రుని పాలెం వద్ద ఏర్పాటుచేసిన పైలాన్ ను ఆవిష్కరించి మెుక్కను నాటారు వైఎస్ జగన్. అనంతరం ఆయన కొత్తవలస రోడ్ షో లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆదివారం మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన ఎమ్మెల్యేకు సంతాపం ప్రకటించారు.తమను మోసం చేసి బయలకు వెళ్లిపోయనప్పటికి అతడి మృతిపై విచారం ప్రకటిస్తున్నట్లు జగన్ అన్నారు. మృతుల కటుంబాలకు సానుభూతి తెలిపారు. 

రాబోయే 6నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తి నాయకుడుగా కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.  అబద్దాలు, మోసాలు చేసేవాడు మీకు సీఎంగా కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోంచి దిగిపోతే రాష్ట్ర పరిస్థితి సెట్ అవుతుందన్నారు. సొంతమామను వెన్నుపోటు పొడిచి  9 ఏళ్లు అవినీతి పాలన సాగించారని చంద్రబాబును విమర్శించారు. ఆయన బాద్యతలు చేపట్టగానే మద్య నిషేదం, రూ.2 కిలో బియ్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యవసాయం, వర్షాలు, గిట్టుబాట ధర, ఇళ్ళ నిర్మాణాలు, రాజకీయ విలువలు గోవింద అయ్యాయని జగన్ విమరన్శించారు.

 ఎస్ కోట నియోజకవర్గంలో టీడీపీకి చెందిన వారే 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని అయినా అభివృద్ధి అంతంత మాత్రమేనన్నారు. ఎస్ కోటను 30 ఏళ్ల నుండి పాలిస్తూ 30 పడకల ఆస్పత్రి, జూనియర్ కళాశాలలు సాధించలేకపోయారన్నారు. రైతు బజార్ లను కానీ, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఎస్ కోట నియోజకవర్గంలో జూనియర్ కళాశాలకు అడ్డుపడుతుంది స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపించారు. 

ఎల్ కోట, వేపాడ, కొత్తకోట మండలాల్లో నిత్యం కరువు తాండవిస్తుంటుందని జగన్ గుర్తు చేశారు. ఇక్కడి రైవాడ,తాటిపూడి రిజర్వాయర్ల నీటిని విశాఖకు తరలించి ఇక్కడివారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి రైతులకు మేలు జరగాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని...అయితే ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు అవినీతే అడ్డుపడుతోందని పేర్కొన్నారు. పోలవరం పేరుతో ప్యామిలీ పిక్నిక్ చేశాడని మండిపడ్డారు. 

తన సొంత కంపనీ హెరిటేజ్ లాభాల కోసం చంద్రబాబు ప్రాకులాడుతున్నాడని జగన్ విమర్శించాడు. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసమే గవర్నమెంట్ స్కూళ్లను కావాలనే మూసేయిస్లున్నారని జగన్ ఆరోపించారు. నారాయణ, చైతన్యల్లో లక్షల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి  సరిగ్గా నిదులివ్వకుండా మంత్రి పంటి నొప్పికి మాత్రం మూడు లక్షల రూపాయలు చెల్లించారని జగన్ విమర్శించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios