జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాబాయి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమ రెడ్డి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఆయన మృతిపట్ల జగన్ సంతాపం తెలిపారు. పురుషోత్తమరెడ్డి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు.
కాగా.. జగన్ కుటుంబసభ్యులు పులివెందులకు వెళ్లారు. ఆయనకు వైయస్ విజయమ్మ, షర్మిల, భారతి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి లు నివాళులు అర్పించారు.
