అమరావతి:ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ సర్కార్  రంగం సిద్దం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని జగన్  అధికారులను ఆదేశించారు.

ఈ నెల 13వ తేదీ నుండి ఆర్టీసీ జెఎసీ ప్రతినిధులతో రవాణా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కృష్ణబాబు శనివారం నాడు చర్చించారు.  ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన గురించి కృష్ణబాబు తెలిపారు.

ఈ నెల 10వ తేదీన  జగన్ మంత్రివర్గం తొలి సమావేశం జరగనుంది.  అయితే మొదటి కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రక్రియ గురించి చర్చ రాకపోవచ్చు.  రెండో కేబినెట్ సమావేశంలో  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది.ఆర్టీసీ జేఎసీ ప్రతినిధులు ఇదే విషయమై సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చర్చించే అవకాశం ఉందని సమాచారం.