ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. పాదయాత్రను ముగించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సు యాత్రకు కూడ ప్లాన్ చేస్తున్నారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. పాదయాత్రను ముగించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సు యాత్రకు కూడ ప్లాన్ చేస్తున్నారు. అయితే బస్సు యాత్ర ఎప్పుడనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బస్సు యాత్రకు ముందే పార్టీ స్థితిగతులపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
సుదీర్ఘకాలం పాదయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ పాదయాత్రను ముగించుకొని స్వంత జిల్లాకు శుక్రవారం నాడు చేరుకొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రచారం చేసేందుకు ఈ యాత్ర ఉపయోగపడిందని వైసీపీ భావిస్తోంది.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ పార్టీలు భావి
స్తున్నాయి. ఈ మేరకు పార్టీల నేతలంతా ఎన్నికలకు సిద్దమౌతున్నారు.
ఇదిలా ఉంటే పాదయాత్ర ముగించిన జగన్ మరో యాత్రకు ప్లాన్ చేసుకొంటున్నారు. రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారు.బస్సు యాత్రకు ముందే జగన్ పార్టీ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని జగన్ ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే బస్సు యాత్ర ప్రారంభించే లోపుగానే ఆయా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించనున్నారు.
పార్టీ సమీక్షల సమయంలోనే అభ్యర్థుల ఫైనల్ చేసే అవకాశాలు కూడ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బస్సు యాత్రే ఎన్నికల ప్రచార యాత్రగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
