Asianet News TeluguAsianet News Telugu

మూడు వేల కి.మీ. పాదయాత్ర: పైలాన్ ఆవిష్కరించిన జగన్ (వీడియో)

వైఎస్ జగన్ పాదయాత్ర సోమవారం నాడు 3 వేల కి.మీ,చేరుకొంది. 

Jagan launches pylon at kothavalasa in vizianagaram district
Author
Vijayanagaram, First Published Sep 24, 2018, 4:34 PM IST

హైదరాబాద్: వైఎస్ జగన్ పాదయాత్ర సోమవారం నాడు 3 వేల కి.మీ,చేరుకొంది.  పాదయాత్ర మూడు వేల కి.మీ. చేరుకొన్న సందర్భాన్ని పురస్కరించుకొని  విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు.

2017 నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు.  ఇవాళ్టికి జగన్ పాదయాత్ర మూడువేల కి.మీ. చేరుకొంది 11 జిల్లాల గుండా యాత్ర విజయనగరం జిల్లా కొత్తవలసలో మూడువేల కి.మీ. మైలురాయిని దాటింది

"

గత ఏడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన యాత్ర అనేక మైలు రాళ్లను దాటుకొంటూ కొనసాగింది.అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరులో జగన్ పాదయాత్ర 500 కి.మీ మైలురాయిని దాటింది.నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో వెయ్యి కి.మీ. దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురులో 1500 కి.మీ. చేరుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా మాదేపల్లిలో రెండువేల కి.మీ. దాటింది. తూర్పుగోదావరి జిల్లా పసలపూడి శివారులో  2500 కి.మీ మైలురాయిని  జగన్ పాదయాత్ర దాటింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 3000 కి.మీ మైలు రాయిని దాటింది.

సంబంధిత వార్తలు

ప్రజా సంకల్పయాత్ర: జగన్ ఆరోగ్య రహస్యమిదే...!

పాదయాత్రలో వైఎస్ జగన్ దినచర్య ఇదీ..

జగన్ పాదయాత్ర@3000 కి.మీ... గిన్నిస్‌బుక్‌లో స్థానం

Follow Us:
Download App:
  • android
  • ios