Asianet News TeluguAsianet News Telugu

పాదయాత్రలో వైఎస్ జగన్ దినచర్య ఇదీ...

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర నవంబర్ 5వ తేదీ నుంచి చేస్తున్నారు. ఆయన మధ్య మధ్య విరామాలు తీసుకుంటున్నా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పాదాలు చీలిపోయి, రక్తం ఓడుతున్నా ఆయన తన పాదయాత్రను ఆపడం లేదు.

YS Jagan's daily life in Padayatra
Author
Visakhapatnam, First Published Sep 15, 2018, 5:29 PM IST

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర నవంబర్ 5వ తేదీ నుంచి చేస్తున్నారు. ఆయన మధ్య మధ్య విరామాలు తీసుకుంటున్నా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పాదాలు చీలిపోయి, రక్తం ఓడుతున్నా ఆయన తన పాదయాత్రను ఆపడం లేదు.

పాదయాత్రలో ఆయన దినచర్య అతి సాధారణంగా ఉంటుంది. ఆడంబరాలు ఉండవు. ఆయన ప్రతి రోజూ ఉదయం 4.30 గంటలకు లేస్తారు. వ్యాయామం, ధ్యానం చేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. ఆ తర్వాత ప్రజల నుంచి పిటిషన్లు అందుకుంటారు. తన కోసం వచ్చే నాయకులను కలుసుకుంటారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. 

ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు తన పాదయాత్రను ప్రారంభిస్తారు. దాదాపు సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఆ పాదయాత్ర కొనసాగుతుంది. తాను నడిచే దారిలో ఎక్కువ గ్రామాలు ఉంటే దాదాపు రోజుకు పది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కొనసాగిస్తారు. తక్కువ గ్రామాలు ఉంటే 14 నుంచి 15 కిలోమీటర్లు నడుస్తారు. 

ఆయన భోజనంలో మాంసాహారం ఉండదు. శాకాహారమే తీసుకుంటారు. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పాదయాత్ర కొనసాగిస్తారు. మధ్యాహ్నం భోజనం తీసుకుంటారు. రాత్రి పూట అప్పుడప్పుడు ఎగ్ బుర్జీ తీసుకుంటారు. లేదంటే సాధారణమైన శాకాహారమే తీసుకుంటారు. 

మధ్యాహ్నం భోజనం, విశ్రాంతి టెంటులోనే తీసుకుంటారు. ఆ టెంటులోనే ప్రజలను, నాయకులను కలుస్తారు. రాత్రి పూట కూడా అదే టెంటులో ఓ సాధారమైన మంచంపై పడుకుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి మాత్రం ఓ బస్సును ఏర్పాటు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios