జగన్ ప్రభుత్వం రాగానే బీచ్‌ల వద్ద వాహనాలకు పార్కింగ్ వసూలు చేయడం ప్రారంభమైందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఇప్పుడు విశాఖలోని రుషికొండ బీచ్‌లో అడుగు పెట్టాలంటే రూ. 20 ఫీజు వసూలు చేస్తున్నారని, దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో అన్నీ తాకట్టు పెట్టారని, ఇప్పుడు రుషికొండ బీచ్‌కు కూడా జగన్ ప్రభుత్వం ఎంట్రీ ఫీజు పెట్టిందని ఫైర్ అయ్యారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు.
విశాఖలో తాకట్టు పెట్టాలనుకువన్నీ తాకట్టు పెట్టేశారని, అమ్మేయాలనుకున్నవన్నీ అమ్మేశారని, కూల్చాలనుకున్నవన్నీ కూల్చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు, వేయాలనుకున్న పన్నులన్నీ ప్రజలపై వేశారని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు బీచ్‌ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తున్నారని ట్వీట్ చేశారు.
విశాఖ పట్నం అనగానే చాలా మందికి అందమైన బీచ్‌లు గుర్తుకు వస్తాయని, పర్యావరణ ప్రేమికులు సముద్ర తీరంలో కాసేపు సేదతీరి ఒత్తిడి వదిలించుకుంటారని పేర్కొన్నారు. సాయంత్రంపూట విశాఖ వాసులు బీచ్‌కు వచ్చి కూర్చుంటారని, కానీ, ఇక నుంచి రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే డబ్బులు వెంట పెట్టుకుని వెళ్లాలని అన్నారు. బీచ్‌కు ఎంట్రీ ఫీజు రూ. 20 పెట్టారని, దీంతో ప్రకృతి ప్రేమికుల నుంచి అసహనం వ్యక్తమవుతున్నదని తెలిపారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే బీచ్‌ల దగ్గర బైక్ పార్కింగ్‌కు రూ. 10, కార్ల పార్కింగ్‌కు రూ 30, బస్సుల పార్కింగ్‌కు రూ. 50 ఫీజు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు బీచ్‌లో అడుగు పెట్టాలంటే కూడా ఫీజు బాదుతున్నారని తెలిపారు.
Also Read: పోర్న్ వీడియోలు చూడాలని భార్యకు వేధింపులు..అలాగే చేయాలని బలవంతం.. చివరకు ఏం జరిగిందంటే?
సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి బీచ్‌లను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఇతర హంగులనూ చేర్చుతారు. కానీ, ఇక్కడ జగన్ ప్రభుత్వం మాత్రం వచ్చే పర్యాటకుల నడ్డి విరిచే పనిలో పడిందని విమర్శించారు. కాబట్టి, ఎంట్రీ టికెట్లపై జగన్ ప్రభుత్వం పునరాలోచించాలని సూచనలు చేశారు.
