అమరావతి : రాష్ట్రంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

అమరావతి : రాష్ట్రంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొంది. సచివాలయం, ఆయా శాఖల అధినేతలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఈ మార్పులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 

అయితే 12 గంటల తర్వాత కార్యాలయాలు ఉండాలంటే మాత్రం పాసులు కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనకు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 12 గంటల నుంచి ఉదయం పూట కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యల ప్రభావం ప్రజా రవాణాపై పడింది. ఇప్పటికే ఏపీలో కోవిడ్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ సైతం సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా తీవ్రత: ఏపీ- తెలంగాణ మధ్య ఇప్పటికే బస్సులు బంద్.. తాజాగా రైళ్లు కూడా...

ఇరు రాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ నేపథ్యంలో ప్రయాణానికి జనం ఆసక్తి చూపించకపోవడంతో రైళ్లు వెలవెలబోతున్నాయి. దీంతో అతి తక్కువ ఆక్యుపెన్సీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

ఇరు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. వీటిలో శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు సైతం వున్నాయి. 

అంతకుముందు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ బస్సులను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ ఎండీ . ఏపీలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona