చంద్ర‌బాబు హాయాంలో అవినీతి ప‌రాకాష్ట‌కు చేరిందన్న జగన్. మూడున్న‌ర సంవ‌త్స‌రంలో ఒక్క‌టంటే ఒక్క ఇల్లైనా క‌ట్టించారా... పేదలకు ఎక్క‌డైనా సెంట్ భూమీ ఇచ్చారా...? బాబుకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి త‌ప్ప ప్ర‌జా అభివృద్ది ప‌ట్ట‌ద‌ని ఎద్దేవా చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపి అధినేత ధ్వజమెత్తారు. చంద్రబాబు హాయాంలో అవినీతి పరాకాష్టకు చేరిందని విమర్శించారు జగన్. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ఆయన ప్రచారం ఎనిమిదవ రోజుకు చేరుకుంది."చింత అరుగు"లో జరిగిన రోడ్ షోలో బాబు పాలన పై జగన్ పలు ఆరోపణలు చేశారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను బాబు ఒక్కటైనా నెరవేర్చారా.. అని నిలదీశారు జగన్. పేదవారికి ఇళ్లన్నారు మూడున్నర సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క ఇల్లైనా కట్టించారా.. అని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. పెదవారికి భూములన్నారు.. ఎక్కడైనా సెంట్ భూమీ ఇచ్చారా అని అడిగారు. ఎన్నికల సమయంలో బెల్టు షాపులు లేకుండా చేస్తానని బాబు హామీ ఇచ్చారు, కానీ బెల్ట్ షాపులు తగ్గాయా.. పెరిగాయా.. అని మహిళలను ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. రైతులకు, మహిళలకు రుణమాఫిలు అన్నారు, బాబు చేశారా.. అని ధ్వజమెత్తారు. వైస్ హయాంలో ఉన్న పెన్షన్లను బాబు హాయాంలో సగానికి తగ్గించారని ఆయన పెర్కొన్నారు. ఇంతా చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుండి పోవాలా.. వద్దా అని జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.
వైఎస్ హాయాంలో పెదల చదువుల కోసం ఫీజు రియాంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారని, బాబు దానిని తుంగలో తొక్కారని విమర్శించారు. నేడు ఇంజనీరింగ్ చదువుకి అయ్యో ఖర్చు లక్షల్లో ఉందని ఆయన పెర్కొన్నారు. బాబుకు ముఖ్యమంత్రి పదవి తప్ప ప్రజా అభివృద్ది పట్టదని ఎద్దేవా చేశారు. బాబు పుట్టుకతోనే మోసం చెయ్యడం బాగా ఓంటబట్టించుకున్నారిని జగన్ ఆరోపించారు.
