ఆంధ్ర అసెంబ్లీలో కొత్త ప్రాక్టీస్

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిరుద్యోగ భృతి గురించి ప్రతిపక్షనాయకుడు జగన్ మాట్లాడుతున్నపుడు మైక్ కట్ అయింది.

 నిరుద్యోగ భృతికి ఈ ఏడాది బడ్జెట్ ల్ కేవలం రు. 500 కోట్లు కేటాయించడం పట్ల జగన్ విస్మయం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి గురించి అంత అర్బాటంగా ప్రచారం చేసుకుని ఇపుడు కేవలం రు. 500 కోట్లు కేటాయించి, అదేదో గొప్ప వరం అన్నట్లు గా రు.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఏమిటో అర్థంకావడం లేదని అన్నారు,.

‘జాబు రావాలంటే బాబు రావాలని మీరు సంతకం చేసిన కరపత్రాన్ని ఇంటింటికి పంచిపెట్టారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామనీ చెప్పారు. ఈ లెక్కన రాష్ట్రంలోని కోటీ 75 లక్షల ఇళ్లకు నెలకు రూ.3500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.40 వేల కోట్లకు పైగా కావాలి....,’ అని జగన్ వివరిస్తున్నపుడు మైక్ కట్టయింది.

 వెంటనే మాట్లాడే అవకాశాన్ని బీజేపి శాసన సభపక్ష నాయుడు విష్ణుకుమార్‌ రాజుకు ఇచ్చారు.

మైక్ కట్ చేయడానికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ అసెంబ్లీ వెల్ లోకి వెళ్లి స్పీకర్‌ పోడియందగ్గిర నిలబడ్డారు.

మళ్లీ నిరుద్యోగ భృతి గురించి మాట్లాడేందుకు అవకాశం రాలేదు.

జనరల్ ప్రతిపక్ష నాయకుడి స్పీచ్ మధ్యలో మైక్ కట్ చేయడం అరుదాతి అరుదు.