ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రజల తపన ఆ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమౌతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే... ఆయనకు ఇప్పుడు ప్రజల్లో ఉన్న క్రేజ్ మరో ఎత్తు. ఆయనపై అభిమానాన్ని అభిమానులు వినూత్నంగా తెలియజేస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే.... జగన్ కి దక్కినంత క్రేజ్ మరే సీఎంకి దక్కలేదేమో అన్న సందేహం కలుగుతోంది.

సాధారణంగా మనం కార్లపై నెంబర్ ప్లేటును గమనిస్తే.. అక్షరాలు, నెంబర్లు ఉంటాయి. కానీ కొన్ని కార్లపై ఎలాంటి నెంబర్లు లేవు. కేవలం జగన్ పేరు తప్ప. అదేమీ జగన్ సొంత కార్లు కావు.. ఆయన కుటుంబసభ్యులవీ కావు. కేవలం ఆయన అభిమానులవే. 

ఆయన మీద అభిమానంతో నంబర్ ప్లేట్ పై ఏపీ సీఎం జగన్, జై జగన్ పేర్లు ముద్రించుకొని ప్రేమను తెలియజేస్తున్నారు. ఇంకొందరు కారు వెనక భాగాన జగన్ ఫోటోలను కూడా అంటించుకోవడం విశేషం.