Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ గుణ్ణం చంద్రమౌళిపై ఐటీ దాడులు

ఐదుగురు ఐటీ అధికారులు గురువారం ఉదయం రౌతులపూడిలోని ప్రియాంక స్టోన్‌ క్రషర్‌ వద్దకు వెళ్లి సాయంత్రం వరకు తనిఖీలు చేప ట్టారు. అలాగే పలు హేచరీలు, కాకినాడలోని ఆయన కార్యాలయంపైనా ఐటీ సోదాలు జరిగినట్టు తెలిసింది. శుక్రవారం కూడా సోదాలు కొనసాగినట్లు సమాచారం.

IT Raids on Priyanka Water Plant Owner Gunnam ChandraMouli
Author
Hyderabad, First Published Feb 8, 2020, 8:08 AM IST

కాకినాడ స్మార్ట్‌సిటీ కాంట్రాక్టర్‌, ప్రియాంక మినరల్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత గుణ్ణం చంద్ర మౌళిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేపట్టారు. రౌతులపూడిలోని ప్రియాంక మినరల్స్‌ అండ్‌ స్టోన్‌క్రషర్‌, ఆయన నిర్వహిస్తున్న పలు హేచరీలపై నా ఈ దాడులు జరిగాయి. 

ఐదుగురు ఐటీ అధికారులు గురువారం ఉదయం రౌతులపూడిలోని ప్రియాంక స్టోన్‌ క్రషర్‌ వద్దకు వెళ్లి సాయంత్రం వరకు తనిఖీలు చేప ట్టారు. అలాగే పలు హేచరీలు, కాకినాడలోని ఆయన కార్యాలయంపైనా ఐటీ సోదాలు జరిగినట్టు తెలిసింది. శుక్రవారం కూడా సోదాలు కొనసాగినట్లు సమాచారం.

ఈ దాడుల్లో పలు రకాల డాక్యుమెంట్లను ఆదాయ పన్ను శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. చంద్రమౌళి హేచరీల నిర్వహణతోపాటు కాకినాడ స్మార్ట్‌ సిటీకి సంబం ధించి అనేక రహదారుల కాంట్రాక్టులు చేస్తున్నారు.

 కోట్లలో ప్రియాంక మినరల్స్‌, ప్రాజెక్ట్స్‌ పేరుతో లావా దేవీలు నిర్వహిస్తున్నారు. కాగా రౌతులపూడి మండలంలోని చిన్నమల్లాపురంలో మరో వ్యాపారికి చెందిన స్టోన్‌క్రషర్‌పైనా ఐటీ దాడులు జరిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios