ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటీ దాడులు

IT raids on jaggampeta MLA jyothula nehru's house
Highlights

రాష్ట్రవ్యాప్తంగా కలకలం 

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త రాష్ట్రంలో కలకలం రేపింది. 
నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. అదే గ్రామంలో మరికొందరి ఇళ్లపై దాడులు జరిగినట్టు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఆదాయపన్ను శాఖ బుదవారం వెల్లడించవచ్చని అంటున్నారు. నెహ్రూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. విశాఖ ఐటి అదికారులు ఈ దాడులు నిర్వహించారు

loader