తిరుపతిలో డాలర్స్ గ్రూప్ సంస్థలపై ఐటీ దాడులు..
తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి.

తిరుపతి : తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని తిరుపతిలోనూ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో డాలర్స్ గ్రూప్ చైర్మన్ ఇల్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. డాలర్స్ గ్రూప్ చైర్మన్ గా ఉన్న దివాకర్ రెడ్డి ఇల్లు, ఆఫీస్ తో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వీరి ఇళ్లలో ఐటీ అధికారులు నిన్నటి నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.