మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి  ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. నాగార్జున హిల్స్‌లో ఉన్న కంపెనీలో రెండు రోజులగా సోదాలు చేశారు. స్ప్లెన్‌ డిడ్ మెటల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలో శుక్రవారం రాత్రి వరకు అధికారులు సోదాలు నిర్వహించారు.

నాగార్జున హిల్స్‌లోని ఆఫీసులో శుక్రవారం రాత్రి పలు పత్రాలను అధికారులు పరిశీలించి, కీలకమైన డాక్యూమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.