హైదరాబాద్: డేటా చోరీ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్ బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సిట్‌ అధికారులకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

బుధవారం నాడు డేటా చోరీ కేసు విషయమై హైకోర్టులో విచారణ జరిగింది. సిట్ విచారణకు సహకరించాలని,  విచారణ సమయంలో ఆశోక్ సిట్ అధికారుల ముందు హాజరుకావాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆశోక్  పాటించలేదు.  దీంతో ఆశోక్  కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సిట్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే  ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్ బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. అయితే ఈ విషయమై హైకోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకొంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.