ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇరువురు ఒక‌టే. ఐసిస్‌ ప్రపంచానికి ప్రమాదకరమైతే.... వైఎస్ జగన్‌ రాష్ట్రానికి అంతే ప్రమాదకరం. జ‌గ‌న్ నంద్యాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ద తారాస్థాయికి చేరుకుంటుంది. టీడీపీ మంత్రులు జ‌గ‌న్ పై మాట‌ల దాడీ మ‌రింత పెంచారు. శుక్ర‌వారం మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ పై ధ్వ‌జ‌మెత్తారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇరువురు ఒక‌టేన‌ని విమ‌ర్శించారు క్రీడ‌ల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర. ఐసిస్‌ ప్రపంచానికి ప్రమాదకరమైతే.... వైఎస్ జగన్‌ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరమని ఎద్దేవా చేశారు. 

జ‌గ‌న్ నంద్యాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నార‌ని ఆరోపించారు మంత్రి. టీడీపీ చేస్తున్న‌ అభివృద్దిని త‌ట్టుకోలేక జ‌గ‌న్ త‌మ పార్టీ పైన విమ‌ర్శ‌ల‌కు పాలుప‌డుతున్నార‌ని పెర్కొన్నారు. జగన్ లో నంద్యాల ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయం కనపడుతోందని రవీంద్ర‌ అన్నారు. ఈ భయంతో నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఉపఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర అన్నారు.