వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందా? ఏపీ ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు, ఒక ప్రభంజనంలా కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందా? అన్నది జాతీయ మీడియా దృష్టి సారించింది. పాదయాత్ర గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు  జగన్‌తో ఎన్డీటీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది.

‘ఆన్‌ రియాలిటీ చెక్‌’  కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ఎన్డీటీవీలో ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం గురించి శ్రీనివాసన్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు. ‘వైఎస్‌ఆర్‌ బతికి ఉన్నంతవరకు నన్ను గౌరవనీయుడిగానే చూశారు’ అన్న వైఎస్‌ జగన్‌ కామెంట్‌ను జగన్ ట్వీట్ చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపే అవకాశముందని పేర్కొ‍న్నారు. పాదయాత్ర జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపనుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.