సంక్రాంతికి కొత్త జిల్లాలా ?

First Published 11, Dec 2017, 11:50 AM IST
Is naidu decided to increase number of districts in AP
Highlights
  • రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు చాలవన్నట్లుగా మరో ప్రచారం మొదలైంది.

రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు చాలవన్నట్లుగా మరో ప్రచారం మొదలైంది. ఏపిలో కొత్తగా మరికొన్ని జిల్లాలు ఏర్పాటు కాబోతోందన్నది ప్రచారం సారాంశం. నిజమా ? కాదా ? అన్నది వేరే విషయం. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి చంద్రబాబునాయుడు కొత్త జిల్లాల ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్న జిల్లాల జాబితా కూడా చక్కర్లు కొడుతోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులతో ప్రస్తావిస్తే, మంత్రులు, ఉన్నతాధాకారుల మధ్య సంభాషణల్లో కొత్త జిల్లాల అంశంపై చర్చ జరుగుతున్నట్లు చెప్పారు. అయితే, కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయా లేదా అన్నది తమకు తెలీదన్నారు.

ప్రచారంలో ఉన్న మొత్తం జిల్లాల జాబితా ఈ విధంగా ఉంది.

1) శ్రీకాకుళం, 2) palakoda (శ్రీకాకుళం), 3) విజయనగరం, 4) పార్వతీపురం, (విజయనగరం), 5) తూర్పుగోదావరి, 6) కాకినాడ (eastgodavari), 7) అమలాపురం (eastgodavari), 8) పశ్చిమ గోదావరి, 9) ఏలూరు, (westgodavari), 10) గుంటూరు, 11) పొన్నూరు (గుంటూరు), 12) narsaraopet (గుంటూరు), 13) ప్రకాశం, 14) కందుకూర్ (ప్రకాశం), 15) కృష్ణా, 16) gudiwada (కృష్ణా), 17) మచిలీపట్నం (కృష్ణా), 18) కర్నూలు, 19) nandayal (కర్నూలు), 20) విశాఖపట్నం, 21) అరకు (విశాఖపట్నం), 22) కడప, 23) pulivendala (కడప), 24) ananthapuram 25) హిందుపురం, చిత్తూరు 26)  తిరుపతి  27)

loader