2019లో ‘ఆది’ ఓటమికి జగన్ ప్రత్యేక వ్యూహం ?

2019లో ‘ఆది’ ఓటమికి జగన్ ప్రత్యేక వ్యూహం ?

వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని జమ్మలమడుగు ఎంఎల్ఏ, ఫిరాయింపు మంత్రి ఆది నారాయణరెడ్డిని ఓడించేందుకు వైసీపీ గట్టి వ్యూహాన్నే రచిస్తున్నట్లు సమాచారం. ఈనెల 6వ తేదీన ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జమ్మలమడుగులో రాత్రి బస చేసారు. ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గంలో అడుగు పెట్టే సమయానికి జనాలు ఎవరూ జగన్ వైపు వెళ్ళ కుండా ఫిరాయింపు మంత్రి తన అనుచరుల ద్వారా ప్రయత్నాలు చేసారట. అయితే, ఫిరాయింపు మంత్రి మద్దతుదారుల మాటను ఎవరూ లక్ష్య పెట్టలేదు. నియోజకవర్గంలో జగన్ ఉన్న రెండు రోజులూ జనాలు విపరీతంగా వచ్చిన సంగతి అందరకీ తెలిసిందే.

ఉదయం పాదయాత్రను ప్రారంభించి మధ్యహ్నం భోజన సమయానికి ఓ టెంటులో విశ్రాంతి తీసుకునే సమయంలో జగన్ చెవిలో ఫిరాయింపు మంత్రి చేసిన ప్రయత్నాన్ని చెప్పారట. దాంతో అప్పటికప్పుడు జగన్ కొందరు కీలక నేతలను రాత్రికల్లా రావాలని కబురు పంపారట. మళ్ళీ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత రాత్రి బస చేసే ప్రాంతానికి కొందరు నేతలు చేరుకున్నారట. పాదయత్రను ముగించి శిబిరానికి చేరుకున్నజగన్ వారితో ఫిరాయింపు మంత్రి గురించి చర్చించారట. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ ఫిరాయింపు మంత్రి గెలిచేందుకు లేదని జగన్ స్పష్టంగా చెప్పారట.

ఫిరాయింపు మంత్రిని కట్టడి చేసేందుకు అవసరమై వ్యూహాలు, అమలు బాధ్యతలు తీసుకునే విషయంలో పక్కాగా స్కెచ్ వేయమని ఆదేశించారట. జగన్ తో భేటీ అయిన నేతల్లో కడప ఎంపి అవినాష్ రెడ్డి, జమ్మలమడగు నియోజకవర్గ ఇన్ ఛార్జి సుధీర్ రెడ్డి, కమలాపురం ఎంఎల్ఏ రవీంద్రనాధరెడ్డి, వివేకానందరెడ్డి తదితరులున్నట్లు సమాచారం.నియోజకవర్గంలో ఆది వ్యతిరేకులను వైసీపీ గూటిలోకి తేవటం కూడా ఇందులో భాగమే,

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టుపై గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా సుమారు 12 వేల మెజారిటితో గెలిచారు. అయితే, టిడిపిలోకి ఫిరాయించిన దగ్గర నుండి జగన్ను లక్ష్యంగా చేసుకుని పదే పదే సవాళ్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో జగన్ కు కూడా బాగా చిర్రెత్తింది. అంతేకాకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తనకు 60 వేల మెజారిటీ వస్తుందని సవాళ్ళు కూడా చేస్తున్నారు. అందుకే పిరాయింపుమంత్రి ఓటమికి జగన్ ప్రత్యేకంగా వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page