అమరావతిలో చంద్రబాబునాయుడు నిర్మించాలనుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత భవనాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేసారు. చంద్రబాబునాయుడు నిర్మించాలనుకుంటున్నది ఏపి అసెంబ్లీనా లేక బాహుబలి అసెంబ్లీనా? అన్న ప్రశ్నించారు.
అమరావతిలో చంద్రబాబునాయుడు నిర్మించాలనుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత భవనాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేసారు. చంద్రబాబునాయుడు నిర్మించాలనుకుంటున్నది ఏపి అసెంబ్లీనా లేక బాహుబలి అసెంబ్లీనా? అన్న ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్క్రీన్ లో నిర్వహించి టెలికాస్ట్ ఎలా చేయాలో రాజమౌళిని అడిగితే సరిపోతుందని వ్యంగ్యంగా అన్నారు. గ్రీన్ మ్యాట్ స్క్రీన్ అన్నది డిజిటల్ ఎఫెక్టుల కోసం వాడుతారన్న విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని రాజమౌళి ఎక్కువగా వాడుతారు. అదే విషయాన్ని వర్మ ప్రస్తావించారు. అపుడు ఏపి అసెంబ్లీ స్ధానంలో బాహుబలి అసెంబ్లీని నిర్మిస్తే ప్రపంచంలో అదే బెస్ట్ అవుతుందని ఎద్దేవా చేసారు. అమరావతిలో చంద్రబాబునాయుడు నిర్మించాలనుకున్న అసెంబ్లీ తదితర భవనాలపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. రాజధాని డిజైన్ల కోసం చంద్రబాబు మరో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు రాజధాని నిర్మాణానికి కోట్ల రూపాయల ఖర్చు ఎందుకంటూ ప్రశ్నించారు.
