ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు మంగళవారం కాంగ్రెస్ పార్టీని కలవనున్నారు.

రాజకీయాల్లో శాస్వత మిత్రులు, శాస్వత శతృవులు ఉండరన్నది చంద్రబాబునాయుడు వ్యూహాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. అవసరం వచ్చినపుడు ఏ పార్టీతో అయినా కలవగలరు. అవసరం తీరిపోగానే అదే పార్టీని ఏకపక్షంగా వదిలేసిన ఉదాహరణలు చంద్రబాబు విషయంలో ఎన్నో కనిపిస్తాయి. తాజాగా జరుగనున్న ఘటన కూడా అటువంటిదే అనటంలొ సందేహం లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు మంగళవారం కాంగ్రెస్ పార్టీని కలవనున్నారు. ప్రత్యేకహోదా, కేంద్రంపై అవిశ్వాస తీర్మానంకు మద్దతు కూడగట్టటం లక్ష్యంతో చంద్రబాబు సోమవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో సిఎం బుధవారం సాయంత్రం వరకూ ఉంటారు.

అయితే, కాంగ్రెస్ ఎంపిల మద్దతు తీసుకునే విషయంలో టిడిపిలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమందేమో కాంగ్రెస్ ను కలిస్తే తప్పులేదని చెప్పారు. మరికొందరేమో కాంగ్రెస్ తో కలవటం ఇబ్బందవుతుందేమో అనే సందేహాలను వ్యక్తం చేశారు. సరే, ఏదేమైనా అంతిమ నిర్ణయం చంద్రబాబుదే కాబట్టి సిఎం ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు కదా?

మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు కసరత్తులు ఊతమిచ్చేట్లుగానే ఉన్నాయి.